కావలసిన పదార్థాలు:
కాలీఫ్లవర్: 1
ఆలుగడ్డలు: 3 అల్లం,
వెల్లుల్లి పేస్ట్: 1టీ స్పూన్
ఉల్లిగడ్డలు : 12ఱగా.
పచ్చిమిరపకాయలు: 3
టమాటాలు: 18ఱగా.
జీలకర్ర: అర టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
కారం : 1 టీ స్పూన్
జీలకర్ర పొడి : 1 టీ స్పూన్
ధనియా పౌడర్ : అర టీ స్పూన్
కొత్తిమీర : ఒక కట్ట
ఉప్పు : తగినంత
ఆలూ గోబీ అద్రకి తయారు చేసే విధానం:
కాలీఫ్లవర్‌ను, ఆలుగడ్డలను వేరుగా ఉడికించి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలను, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు కలపాలి. తర్వాత పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి మరికాసేపు కలుపుతుండాలి.
ఇవి వేగాక టమాటాలు వేసి పచ్చిదనం పోయేవరకు బాగా కలపాలి. ఆ తర్వాత ఉడికించిన ఆలూ, కాలీఫ్లవర్ వేసి మూత పెట్టేయాలి. మధ్య, మధ్యలో అడుగంటకుండా కలపాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి. అంతే.. వేడి.. వేడి.. ఆలూ గోబీ అద్రకీ రెడీ!
మరింత సమాచారం తెలుసుకోండి: